
న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్లో అడుగు పెట్టి తొలి సీజన్ లోనే ప్లే ఆఫ్స్ వరకూ వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్2023లో లక్నో ప్లేయర్లు రెండు పక్కలా రెడ్ కలర్ స్ట్రిప్స్‌తో కూడిన డార్క్ బ్లూ కలర్ జెర్సీలో కనిపిస్తారు. గత సీజన్లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో గ్రీనిష్–బ్లూ కలర్ జెర్సీని వాడింది. ఈ సారి లుక్ ను పూర్తిగా మార్చేసింది. కొత్త జెర్సీని బీసీసీఐ సెక్రటరీ జై షా, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓనర్ సంజీవ్ గోయెంకా, టీమ్ మెంటార్ గౌతం గంభీర్ మంగళవారం రివీల్ చేశారు.