
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ డూ ఆర్ డై మ్యాచ్ లో బ్యాటింగ్ లో సత్తా చాటింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసి బౌలర్లపై భారం వేసింది. ఓపెనర్లు మార్కరం(38 బంతుల్లో 61:4 ఫోర్లు, 4 సిక్సర్లు), మిచెల్ మార్ష్(39 బంతుల్లో 65:6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు.. పూరన్ మెరుపులు (45) మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ (65) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మలింగా రెండు.. హర్ష దూబే, హర్షల్ పటేల్, నితీష్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు.
ALSO READ | LSG vs SRH: లక్నోకి చావో రేవో.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మార్ష్, మార్కరం జట్టుకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆరంభం నుంచి ఇద్దరూ దూకుడుగా ఆడడంతో పవర్ ప్లే లో లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరి కొనసాగింది. సన్ రైజర్స్ బౌలర్లను ఒక ఆటాడుకుంటూ పరుగులు చేశారు. ఈ క్రమంలో మార్ష్ 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో మార్కరం సైతం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
వీరిద్దరూ తొలి వికెట్ కు 10.3 ఓవర్లలోనే 115 పరుగులు జోడించిన తర్వాత మార్ష్ 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన పంత్ 7 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో పూరన్, మార్కరం స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 35 పరుగుల భాగస్వామ్యం తర్వాత మార్కరం.. ఆ తర్వాత బదోనీ ఔటయ్యాడు. చివర్లో పూరన్ మెరుపులు మెరిపించడంతో లక్నో 200 పరుగుల మార్క్ అందుకుంది.
LSG would have liked more after the rapid start they had
— ESPNcricinfo (@ESPNcricinfo) May 19, 2025
59-5 in the last five overs 👀
🔗 https://t.co/wiwAaEcIwT | #IPL2025 pic.twitter.com/lLmdRAzDoL