LSGvsSRH: లక్నో సూపర్ షో..సన్ రైజర్స్ ఓటమి

LSGvsSRH: లక్నో సూపర్ షో..సన్ రైజర్స్ ఓటమి

ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ మరో ఓటమి చవిచూసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగి మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సన్ రైజర్స్ నిర్దేశించిన 122 పరుగుల టార్గెట్ ను లక్నో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. 

122 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 35 పరుగులు జోడించారు. అయితే 13 పరుగులు చేసిన మేయర్స్ ఫజలహక్ ఫరూక్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా (7) భవీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ సమయంలో లక్నోను కెప్టెన్ కేఎల్ రాహుల్(35), కృనాల్ పాండ్యా(34) పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్ కు 55 పరుగులు జత చేశారు. 

టప టపా..

అయితే 34 పరుగులు చేసిన కృనాల్ పాండ్యాను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. ఆ తర్వాత లక్నో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 114 పరుగుల వద్ద కెప్టెన్ కేఎల్ రాహుల్ (35), రోమేరియో షెఫర్డ్ (0) వికెట్లను కోల్పోయింది. దీంతో లక్నో 114 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.  ఈ దశలో స్టోయినీస్, నికోలస్ పూరన్ జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. హైదరాబాద్ బౌలర్లలో  ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీసుకోగా..భువనేశ్వర్ కుమార్ , ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులే చేయగలిగింది. బ్యాటింగ్ ప్రారంభించిన  తన తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ (8)ను అవుట్ అయ్యాడు. 
ఆ తర్వాత అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (31)ని పాండ్యా పెవలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతికే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (0)ను గోల్డెన్ డక్‌ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన  హ్యారీ బ్రూక్ (3) దారుణంగా విఫలమయ్యాడు. 

ఆదుకున్న త్రిపాఠీ, సుందర్..

అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా..రాహుల్ త్రిపాఠీ (34), వాషింగ్టన్ సుందర్ (16) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. 34 పరుగులు చేసిన త్రిపాఠీ యష్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్ (4) ఇద్దర్నీ అమిత్ మిశ్రా పెవీలియన్ చేర్చాడు. చివరి ఓవర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 21 నాటౌట్) రెండు భారీ సిక్సర్లు బాదడంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో  కృనాల్ పాండ్యా 3 వికెట్లు దక్కించుకుంటే..అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.