యూపీలో పట్టాలు తప్పిన రైలు..

యూపీలో పట్టాలు తప్పిన రైలు..

యూపీలో రైలు పట్టాలుతప్పింది. బుధవారం (మే28) సాయంత్రం యూపీ రాజధాని లక్నో సమీపంలోని ఐస్ బాగ్ జంక్షన్ దగ్గర లక్నో రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఇంజిన్ వైరింగ్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. 

విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడంలో లక్నోలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.