మార్కెట్‌‌‌‌లోకి లూమినస్‌‌‌‌ పవర్ టెక్నాలజీస్‌‌‌‌ కొత్త ప్రొడక్ట్‌‌‌లు

మార్కెట్‌‌‌‌లోకి లూమినస్‌‌‌‌ పవర్ టెక్నాలజీస్‌‌‌‌ కొత్త ప్రొడక్ట్‌‌‌లు
  • ధర రూ.9,000 నుంచి రూ.85 వేల మధ్య

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇన్వర్టర్లను తయారు చేసే లూమినస్‌‌‌‌ పవర్ టెక్నాలజీస్‌‌‌‌ కొత్త ప్రొడక్ట్‌‌‌‌లను మార్కెట్‌‌‌‌లోకి తెచ్చింది. ఐకాన్, ఆప్టిమస్‌‌‌‌, ఐక్రూజ్ వంటి బ్రాండ్ల కింద వివిధ కెపాసిటీలలో ఇన్వర్టర్లను తీసుకొచ్చింది. ‘ఇండియాలో స్టైలిష్ లుక్‌‌‌‌తో వస్తున్న మొదటి ఇన్వర్టర్‌‌‌‌‌‌‌‌ ఐకాన్‌‌‌‌. దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. పెద్దగా సౌండ్ చేయదు. ఇందులో అమర్చిన బ్యాటరీతో త్రీ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌కు పవర్ అందించగలదు. హై కెపాసిటీతో వస్తున్న ఈ ఇన్వర్టర్‌‌‌‌‌‌‌‌ను కమర్షియల్ అవసరాల కోసం వాడుకోవచ్చు. 

ఆఫీస్‌‌‌‌లు, షోరూమ్స్‌‌‌‌, బ్యాంకులు, డెంటల్ క్లినిక్స్‌‌‌‌, ఎడ్యుకేషనల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌, రెస్టారెంట్లు వంటి కమర్షియల్ ప్లేస్‌‌‌‌లో పవర్ బ్యాకప్‌‌‌‌ను ఐకాన్ అందించగలదు’ అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్‌‌‌‌ గంజు అన్నారు. 2 కేవీఏ కంటే ఎక్కువ కెపాసిటీ లోడ్ ఉన్న చోట్ల ఈ ఇన్వర్టర్ బాగా సరిపోతుందని చెప్పారు.  బ్యాకప్ టైమ్‌‌‌‌ కేవలం 2–5 గంటలేనని అన్నారు. ఐకాన్ ఇన్వర్టర్ ధర రూ.9,000 (90‌‌‌‌‌‌‌‌0 వీఏ), 1,400 వీఏ కెపాసిటీ వేరియంట్ ధర రూ.14,000.  

ఎక్కువ కెపాసిటీ ఉన్న ఇతర మోడల్ ఇన్వర్టర్‌‌‌‌‌‌‌‌ ధర 2కేవీఏ వేరియంట్ అయితే రూ.12,000 దగ్గర, 10కేవీఏ అయితే రూ.85 వేల దగ్గర ఉన్నాయి.  ఉత్తరాఖండ్‌‌‌‌లో కొత్త మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ పెడతామని లూమినోస్ ప్రకటించింది.  ప్రస్తుతం దేశంలో ఇన్వర్టర్ల మార్కెట్ 20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది.