కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం

కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం

ఈ ఏడాది పండుగలు, గ్రహణాలు ఏకకాలంలో వచ్చి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీంతో గ్రహణాల వేళ పండుగలు జరుపుకోవాలా ? వద్దా ? అనే దానిపై జనం సందిగ్ధంలో మునిగిపోతున్నారు. కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో ఆరోజు పండుగ జరుపుకోవాలా.. వద్దా.. అనే డౌట్ లో ఉన్నారు. పలువురు పండితులు మాత్రం ముందురోజే కార్తీక పౌర్ణమి చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడాల్సి ఉండగా...ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. చివరిదైన చంద్రగ్రహణం నవంబర్ 8న ఏర్పడనుంది. అదే రోజు కార్తీక పౌర్ణమి కూడా ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాయంత్రం 5.40 నిమిషాల నుంచి  6.19  వరకు గ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం ఉన్నా ఈ నెల 8నే కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే పండుగ చేసుకోవాలంటున్నారు కొందరు పండితులు. మంగళవారం ఉదయం 8 గంటల 40 నిమిషాల్లోపే ప్రత్యేక పూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు.   

8వ తేదీన కార్తీక పౌర్ణమి రోజే గ్రహణం ఏర్పడుతుండటంతో.. 7వ తేదీన సాయంత్రమే కార్తీక పౌర్ణమి జరుపుకోవాలంటున్నారు మరికొందరు పండితులు. కార్తీక పౌర్ణమి రోజు వ్రతాలు, ఉపవాసాలు ఉండేవాళ్ళు గ్రహణానికి ముందు రోజే చేసుకోవాలంటున్నారు. పాక్షికంగా గ్రహణం ఉన్నందున గర్భిణులు నియమనిష్టలు పాటించాలని చెబుతున్నారు. ఈ ఏడాది పండుగలతోపాటు గ్రహణాలు వచ్చి పబ్లిక్ ని గందరగోళంలో పడేశాయి. దీంతో పండితుల సూచనలతో గ్రహణ నియమాలు పాటిస్తూ పండుగలు చేసుకుంటున్నారు.