ఫైనల్‌గా ఇద్దరు ఇండియన్ హీరోలను కలుసుకున్నా : కొరియన్ యూట్యూబర్

ఫైనల్‌గా ఇద్దరు ఇండియన్ హీరోలను కలుసుకున్నా : కొరియన్ యూట్యూబర్

లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా వేధింపులకు గురైన దక్షిణ కొరియా మహిళా యూట్యూబర్ తాజాగా లంచ్ విత్ 2 జెంటిల్ మెన్ అనే క్యాప్షన్ తో ఓ వీడియోను షేర్ చేశారు. తాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, తనను కాపాడినందుకు గానూ ఆ ఇద్దరు ఇండియన్స్ తో ఆమె లంచ్ లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఆదిత్య, అథర్వలతో కలిసి ఉన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫైనల్ గా ఇద్దరు ఇండియన్ హీరోలను కలిశానని రాసుకొచ్చారు. దాంతో పాటు వారు ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో కలిసి భోజనం చేస్తున్న వీడియోను పంచుకున్నారు.

ఇక సౌత్ కొరియా మహిళా యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె చెయ్యి పట్టుకోవడం, లాక్కెళ్లడం వంటి పనులు చేసి ఆమెను ఇబ్బంది పెట్టారు. అంతే కాకుండా తమ బైక్ పై ఎక్కాలని ఫోర్స్ చేశారు. ఈ వీడియో లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ ఘటన జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం యూట్యూబర్ ను వేధించిన ఇద్దరిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.