హెల్మెట్ ధరించి.. ప్రాణాలు కాపాడుకోండి : ఎస్సై గోపతి సురేశ్

హెల్మెట్ ధరించి.. ప్రాణాలు కాపాడుకోండి : ఎస్సై గోపతి సురేశ్

లక్సెట్టిపేట, వెలుగు: టూవీలర్ నడిపే వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేశ్ కోరారు. గతేడాది ఉట్కూర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముల్కల్ల గూడకు చెందిన ముల్కల ప్రశాంత్ అనే యువకుడు చనిపోయాడు. ప్రశాంత్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబసభ్యులు 50 మంది వాహన దారులకు ఉట్కూర్ చౌరస్తా వద్ద హెల్మెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై పాల్గొని మాట్లాడుతూ.. ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి జీవితాంతం తీరని వేదన మిగులుతుందన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి రోడ్ సేఫ్టీ పాటించాలని కోరారు.