కొవిడ్​ రిలీఫ్​ ఫండ్‌తో లగ్జరీ కార్లు

కొవిడ్​ రిలీఫ్​ ఫండ్‌తో లగ్జరీ కార్లు
  • చీట్​ చేసి దొరికిపోయిండు

లగ్జరీ కార్లంటే అతనికి చాలా ఇష్టం. కాస్ట్లీ టూర్లు వేయాలని కోరిక.  కానీ చేతిలో డబ్బులు లేవు. పైగా కొవిడ్​. చేసుకోవడానికి పని లేదు.  కానీ విపరీతమైన కోరికలు ఏం చేయాలా? అని ఆలోచించాడు. కొవిడ్​ పరిస్థితులను అవకాశం​గా తీసుకొన్నాడు. అతి తెలివి ప్రదర్శించాడు. అడ్డంగా దొరికిపోయాడు. 

కొవిడ్​ కారణంగా చిన్న వ్యాపారాలు, హెల్త్​ కోసం అమెరికా ప్రభుత్వం కొవిడ్​ రిలీఫ్​ ఫండ్​ను ఏర్పాటు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన 38 ఏండ్ల ముస్తఫా ఖాద్రి దాన్నే అవకాశంగా తీసుకున్నాడు. ‘నేను  కొవిడ్​ బాధితుడిని. చిన్న దుకాణాలు ఉన్నాయి’ అని  కొవిడ్​ ఫండ్​ కోసం అప్లయ్​ చేశాడు. ప్రభుత్వం స్పందించి అతనికి ఫండ్​ రిలీజ్​ చేసింది. ఆ ఒక్కసారితో ఆగిపోకుండా... ఫేక్​ డాక్యుమెంట్లతో మళ్లీ మళ్లీ  అప్లయ్​ చేశాడు. మరో మూడు బ్యాంక్​ల్లో కూడా లోన్లు లాగాడు. అలా అమెరికా ప్రభుత్వం నుంచి కొవిడ్​ పేరుతో సుమారు ఐదు మిలియన్ల డాలర్లు తీసుకున్నాడు. ఇక నా కోరికలు తీరే టైం వచ్చింది అనుకున్నాడు. ఆ  డబ్బుతో ఫెరారి, బెంట్లీ,  లాంబోర్గినీ లాంటి  లగ్జరీ కార్లు కొనేశాడు.  కాస్ట్లీ టూర్లకూ వెళ్లాడు. ఓ వారం పది రోజులు బాగా ఎంజాయ్​ చేశాడు. తప్పు చేసిన వాడు దొరక్కుండా ఉంటాడా?   సరిగ్గా వారం రోజుల తర్వాత ముస్తఫా ఇంటి తలుపులు తట్టారు పోలీసులు. ఇంటి ముందు పార్క్​ చేసిన లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బును కూడా వెనక్కి తీసుకొని, అతన్ని జైలుకు పంపారు.