ఈవీ పాంట్లు పెట్టేందుకు లగ్జరీ కంపెనీలు రెడీ

V6 Velugu Posted on Jan 22, 2022

  •       లగ్జరీ కంపెనీలు రెడీ!
  •     ఫెస్టివ్ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇక్కడే తయారైన ఈవీని లాంచ్‌‌‌‌‌‌‌‌ చేయాలనుకుంటున్న బెంజ్‌‌‌‌‌‌‌‌
  •     అసెంబ్లింగ్ యానిట్లు పెట్టే పనిలో వోల్వో, బీఎండబ్ల్యూ 
  •     పెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌ అవ్వడం, ట్యాక్స్ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ ఉండడమే కారణం

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మెర్సిడెస్‌‌‌‌‌‌‌‌ బెంజ్‌‌‌‌‌‌‌‌, వోల్వో వంటి లగ్జరీ కార్ల కంపెనీలు లోకల్‌‌‌‌‌‌‌‌గానే ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌(ఈవీ) ను  అసెంబ్లింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలనుకుంటున్నాయి.   ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా కూడా ఇండియాలో  తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేయాలని చూస్తోంది. కానీ, ఇంపోర్ట్ డ్యూటీ దగ్గర వెనకడుగేస్తోంది. ప్రస్తుతం లగ్జరీ కార్లపై 110 శాతం ఇంపోర్ట్ డ్యూటీని విధిస్తున్నారు. అదే దేశంలోనే అసెంబ్లింగ్ చేస్తే 45 శాతం ట్యాక్స్ మాత్రమే పడుతుంది. దీంతో కన్జూమర్లకు తక్కువ రేటుకే కార్లను అమ్మడానికి వీలుంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.  అంతేకాకుండా దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి పెరుగుతుండడంతో  మనదేశాన్ని అతి పెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌గా చూస్తున్నాయి.  మెర్సిడెస్‌‌‌‌‌‌‌‌ బెంజ్‌‌‌‌‌‌‌‌, ఆడి, బీఎండబ్ల్యూ, వోల్వో వంటి టాప్ కంపెనీలు తమ లగ్జరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తెస్తున్నాయి. ప్రభుత్వం కూడా టెస్లాను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పూర్తిగా విదేశాల్లో  తయారైన వెహికల్స్‌‌‌‌‌‌‌‌పై  ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాలని టెస్లా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈవీలపై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ తక్కువగా ఉండడం, లోకల్‌‌‌‌‌‌‌‌గానే అసెంబ్లింగ్‌‌‌‌‌‌‌‌ను చేపడుతుండడంతో అఫోర్డబుల్‌‌‌‌‌‌‌‌ రేట్లకే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్లను అమ్మగలుగుతున్నాయి 

ఈక్యూఎస్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌ చేస్తాం..

లగ్జరీ  కార్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న మెర్సిడెస్‌‌‌‌‌‌‌‌ బెంజ్‌‌‌‌‌‌‌‌ , లోకల్‌‌‌‌‌‌‌‌గానే తయారైన ఈక్యూఎస్‌‌‌‌‌‌‌‌ సెలూన్‌‌‌‌‌‌‌‌ను ఈ ఏడాది తీసుకురావాలని చూస్తోంది. ఈక్యూఎస్‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌ వేరియంట్‌‌‌‌‌‌‌‌ ధరకు  ధీటుగానే  ఈవీ వేరియంట్ ఉంటుందని అంచనా.   స్వీడిష్ కంపెనీ వోల్వో కూడా  ఇదే ప్లాన్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవుతోంది. విదేశాల్లో పూర్తిగా తయారైన ఈవీలపై ఇంపోర్ట్‌‌‌‌‌‌‌‌ డ్యూటీని తగ్గించాలని బీఎండబ్ల్యూ ప్రభుత్వాన్ని కోరుతోంది. కానీ, కేవలం కొంత కాలం వరకు మాత్రమే డ్యూటీని తగ్గించాలని అడుగుతోంది.  లోకల్‌‌‌‌‌‌‌‌గా ఈవీలను తయారు చేసే ఆలోచన కూడా ఉందని చెబుతోంది.  

ఈవీలపై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ చాలా తక్కువ..

దేశంలో లగ్జరీ ఈవీ కార్లపై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కేవలం 5 శాతమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై సెస్‌‌‌‌‌‌‌‌తో కలిపి 50 %  వరకు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ పడుతోంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు దేశ ఈవీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవ్వాలనుకోవడానికి  ఇదొక కారణం. అదే  కార్ల పార్టులను దిగుమతి చేసుకొని లోకల్‌‌‌‌‌‌‌‌గా అసెంబ్లింగ్ చేసే పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌, ఈవీ కార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 40 శాతంగా ఉంటోంది. పూర్తిగా విదేశాల్లోనే తయారైన కార్లపై 66–110 %  ఇంపోర్ట్ డ్యూటీ పడుతోంది. దీన్ని బట్టి ఒకే రకమైన ఈవీని   విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే లోకల్‌‌‌‌‌‌‌‌గా అసెంబ్లింగ్ చేయడం వలన  26–70 % ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను ఆదా చేసుకోవడానికి వీలుంటోంది. వీటికి అదనంగా ఈవీలపై చాలా రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ను ఎత్తేశాయి. అదనంగా చాలా ప్రోత్సాహకాలను ఇస్తున్నాయి.  మరోవైపు లోకల్‌‌‌‌‌‌‌‌గా అసెంబ్లింగ్ యూనిట్లను పెట్టడానికి భారీగా ఖర్చవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే టెస్లా వంటి కంపెనీలు లోకల్‌గా ప్లాంట్లు పెట్టడం కంటే పూర్తిగా తయారైన కార్లను దిగుమతి చేసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి.   లోకల్‌‌‌‌‌‌‌‌గా అసెంబ్లింగ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను పెట్టడం చాలా క్లిష్టతరమైన అంశమని  ఐహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మర్కిత్‌‌‌‌‌‌‌‌ అసోసియేట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌరవ్‌‌‌‌‌‌‌‌ వంగాల్ అన్నారు.  పెద్ద కంపెనీలకు అసెంబ్లింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌ను పెట్టడం పెద్ద విషయం కాదని, కానీ, సేల్స్ వాల్యూమ్‌ తక్కువగా ఉంటే ప్లాంట్‌‌‌‌‌‌‌‌లను పెట్టాల్సిన అవసరం పెద్దగా ఉండదని అన్నారు. గ్రౌండ్ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌, సప్లయ్ చెయిన్ సమస్యలు, లోకల్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ పార్టనర్లను వెతుక్కోవడం వంటి సమస్యలు ఉంటాయని చెప్పారు. ఇండియా నుంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామనే ఆలోచన ఉన్నప్పుడే లోకల్‌గా అసెంబ్లింగ్ ప్లాంట్లను పెట్టడం బెటర్ అని అన్నారు.  

Tagged GST, tesla, Luxury car companies such as Mercedes-Benz and Volvo, Ev Plants

Latest Videos

Subscribe Now

More News