ఆయ్ మేం ఫ్రెండ్సండి అంటూ.. మ్యాడ్ హీరో

ఆయ్ మేం ఫ్రెండ్సండి అంటూ.. మ్యాడ్ హీరో

‘మ్యాడ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.. తన రెండో చిత్రం అల్లు అరవింద్‌‌కు చెందిన ‘జీఏ2 పిక్చర్స్‌‌’ బ్యానర్‌‌‌‌లో చేస్తున్నాడు. బన్నీవాస్‌‌, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. అంజి కంచిపల్లి దర్శకుడు. ఈ మూవీ టైటిల్‌‌ను సోమవారం ప్రకటించారు. ‘ఆయ్’ అనే డిఫరెంట్ టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు. దీనికి ‘మేం ఫ్రెండ్సండి’ అనే ట్యాగ్‌‌లైన్ పెట్టారు.

నయన్ సారిక హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  ఈ నెల 7న ఫస్ట్ లుక్‌‌ను  రిలీజ్ చేసి, సమ్మర్‌‌‌‌లో సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.