దర్జాగా కారులో వచ్చి గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లారు

దర్జాగా కారులో వచ్చి గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లారు

దర్జాగా కారులో వచ్చిన యువకులు గ్యాస్ సిలిండర్ ను ఎత్తుకెళ్లారు. రోడ్డుపై పార్క్ చేసిన ట్రాలీ నుంచి గ్యాస్ సిలెండర్ ను చోరీ చేశారు. మాదన్న పేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఇది గమనించిన యువకులు ఇద్దరు ట్రాలీ వెనక కారు ఆపారు. ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్దారణ చేసుకొని.. సిలిండర్ తీసుకుని కారులో పారిపోయారు. ఈ దృష్యాలన్నీ  సీసీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. 

అయితే కొద్దిసేపటికి ట్రాలీ వద్దకు చేరుకున్న డ్రైవర్ కు సిలిండర్లు తక్కువ ఉండటాన్ని గమనించాడు. అయితే అక్కడ ఉన్న స్థానికులకు ప్రశ్నించగా తమకు ఏం తెలియదని చెప్పారు. దీంతో అనుమానంతో వచ్చి.. ట్రాలీకి ఎదురుగా ఉన్న  సీసీ ఫుటేజీని  పరిశీలించగా.. చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.