బాల్క సుమన్​తో ప్రాణహాని ఉంది : మద్దెల భవాని

బాల్క సుమన్​తో ప్రాణహాని ఉంది : మద్దెల భవాని

మంచిర్యాల, వెలుగు : చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బీఎస్పీ మహిళా విభాగం జోనల్ కన్వీనర్ మద్దెల భవాని అన్నారు. సుమన్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై దాడికి ప్లాన్ చేశాడని ఆరోపించారు. పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి ఆమె మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేశారు.

సుమన్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తాను అంబేద్కర్ వారసురాలినని, బాల్క సుమన్​లాగా బానిసను కాదన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సుమన్​ను ఆమె హెచ్చరించారు. ఆయనను చెన్నూరు నుంచి తరిమికొట్టేదాకా నిద్రపోనని వార్నింగ్​ ఇచ్చారు. 

ALSO READ: స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసాహీ రూ.200 కోట్ల పెట్టుబడి