70 లక్షలు ఇస్తామన్నా.. ఈ గొర్రెను అమ్మలే

70 లక్షలు ఇస్తామన్నా.. ఈ గొర్రెను అమ్మలే

ఏంటి.. ఒక్క గొర్రెకు రూ.70 లక్షలు ఉంటదా? అని ఆశ్చర్యపోతున్రా! అవును మరి.. ఇది అలాంటిలాంటి గొర్రె కాదు.. షీప్ బ్రీడ్స్ లోనే ఉత్తమమైంది. మహారాష్ట్రలోని మద్గ్ యాల్ జాతి గొర్రెలు..వేరే జాతి గొర్రెలతో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటయి. వీటి మాంసం క్వాలిటీ మంచిగ ఉంటది. అందుకే వీటికి ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఫొటోలోని గొర్రె కూడా అదే. ఓ వ్యాపారి రూ.70 లక్షలకు ఈ గొర్రెను అడిగితే… దాని ఓనర్ బాబు మెట్కారీ ఇయ్యనండు. ‘‘ఈ గొర్రెతో నాకు అదృష్టం కలిసొచ్చింది. అందుకే 70 లక్షలకు అడిగినా ఇయ్యనని చెప్పిన. వ్యాపారి ఊకే సతాయించడంతో కోటిన్నరకు అయితే అమ్ముతానన్న. అంతవెట్టి ఎవరూ కొనరని అట్ల చెప్పిన. నా దగ్గర ఇవే జాతి గొర్రెలు ఇంకా ఉన్నా, వాటిలో ఇదే మేలైనది” అని చెప్పిండు బాబు మెట్కారీ.