చీరె ధరించి మారథాన్లో రన్నింగ్..41 కి. మీ పరుగు

చీరె ధరించి మారథాన్లో రన్నింగ్..41 కి. మీ పరుగు

సాధారణంగా రన్నింగ్ అంటే టీషర్ట్.. స్వెట్ ప్యాంట్ వేసుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం చీర ధరించింది. అదేంటి చీర ధరించి రన్నింగ్ ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా..అవును..సదరు మహిళ చీర ధరించి రన్నింగ్ చేయడమే కాదు..మెడల్ కూడా సాధించింది. ఈ సంఘటన యూకేలోని ఆదిదాస్ మాంచెస్టర్ మారథాన్లో చోటు చేసుకుంది. 

భారత్‌ ఒడిశాకు చెందిన 42 సంవత్సరాల మధుస్మిత జేనా అనే మహిళ మాంచెస్టర్ మారథాన్‌లో పాల్గొంది. మాంచెస్టర్‌లోనే నివశించే  మధుస్మితకు మారథాన్ రేసులంటే చాలా ఇష్టం. అందుకే ఈ మారథాన్‌లో పాల్గొంది. అయితే అందరి లాగా టీషర్ట్, ప్యాంటు వేసుకోలేదు. భారతీయ వస్త్రాలైన చీర కట్టుకుని ఈ మారథాన్ లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. 41 కిలోమీటర్ల మారథాన్ ను మధుస్మిత గంటా 50 నిమిషాల్లో పూర్తి చేసి మెడల్ సాధించింది. అంతేకాదు మెడల్ కూడా దక్కించుకుంది. 

మాంచెస్టర్ మారథాన్ 2023లో మధు స్మిత ధరించిన చీరె సంబాల్‌పురి చీర. ఈ రేసులో చీరెతో చాలా కంఫర్టబుల్‌గా పరుగు తీసింది. చీరలో పరుగెడుతున్న మధుస్మితను ఇతర అథ్లెట్లు చప్పట్లతో ప్రోత్సహించారు. ఈ రేస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు  సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.