కేఎన్ త్రిపాఠీ నామినేషన్ తిరస్కరణ

కేఎన్ త్రిపాఠీ నామినేషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. పార్టీ సీనియర్లు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ తో పాటు జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ నేత కేఎన్ త్రిపాఠీ నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల అధికారులు నామినేషన్ల స్క్రూటినీ చేశారు. అనంతరం కేఎన్ త్రిపాఠీ నామినేషన్ తిరస్కరించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. అధ్యక్ష పదవికి మొత్తం 20సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, వాటిలో నాలిగింటిని తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు. సంతకాల రిపిటీషన్, సరిపోలకపోవడం తదితర కారణాల వల్ల వాటిని పక్కన పెట్టామని అన్నారు.

నామినేషన్ల పరిశీలన పూర్తైన అనంతరం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. వారిలో ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేనిపక్షంలో అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి.