మంచిర్యాల, వెలుగు: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 46 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన లయన్వి.మధుసూదన్ రెడ్డి. అంతేకాకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ ఇప్పటివరకు వందల సంఖ్యలో క్యాంపులు నిర్వహించి వేలాది మందితో రక్తదానం చేయించారు. గత కొన్నేండ్లు రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వతహాగా అరుదైన ఏబీ నెగెటివ్ బ్లడ్46 సార్లు దానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా పలుమార్లు జిల్లా కలెక్టర్లు, గవర్నర్చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, అవార్డులు అందుకున్నారు.
నేడు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
అక్టోబర్1న నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్డే సందర్భంగా మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్‌లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు మధుసూదన్ రెడ్డి తెలిపారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, డీసీపీతోపాటు ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు.