
చిన్నారులతో వెళుతున్న ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. మధ్య ప్రదేశ్ లోని హోషాంగబాద్ లో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం పిల్లలతో పాఠశాలకు బయల్దేరిన స్కూల్ బస్సు మార్గమధ్యంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఐదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఎంక్వయిరీ చేస్తున్నారు.