వ్యాక్సిన్ పై అపోహలొద్దన్న వైద్యులు

వ్యాక్సిన్ పై అపోహలొద్దన్న వైద్యులు

కోవిడ్ టీకా వేసుకునేందుకు ఇంకా కొందరు భయపడుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఏదో అయిపోతుందనే అపోహలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అందుకే వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశాయి. మహమ్మారిని అంతం చేసేందుకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ కొందరు మాత్రం టీకా తీసుకునేందుకు ఇంకా వెనుకాడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలోని  ఓ 18 ఏళ్ల అమ్మాయి వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండేందుకు పరుగెడుతూ చెట్టుపైకి ఎక్కేసింది. సిరంజి పట్టుకుని హెల్త్ కేర్ వర్కర్ కూడా ఆమె వెంట పరుగెత్తింది. కిందకు దిగాలని ఎంత బ్రతిమిలాడినా చెట్టు దిగేందుకు ఇష్టపడలేదు. వ్యాక్సిన్ అంటే భయమని..టీకా వేయనంటేనే కిందకు దిగుతానని చెప్పింది. చివరకు గ్రామస్తులంతా అక్కడకు చేరుకుని కిందకు దిగాలని..టీకా వేసుకుంటే ఏమీ కాదని సర్దిచెప్పడంతో ఆ మహిళ కిందకు దిగింది. మంకారి గ్రామంలో వైద్య బృందం పర్యటిస్తూ అందరికీ టీకాలు వేస్తోంది. ఈ క్రమంలో ఓ టీనేజీ అమ్మాయికి వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లగా ఆమె భయపడుతూ చెట్టు ఎక్కింది. ఎట్టకేలకు అందరూ సర్దిచెప్పడంతో టీకా తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పై అపోహలొద్దని..మహమ్మారిని అంతం చేసేందుకు  అందరూ సహకరించాలని వైద్యులు కోరారు. 

READ MORE..

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం..