టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు

టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్..మళ్లీ వస్తున్నా మగధీరుడు

టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్ నడుస్తోంది.  స్టార్ హీరోలు నటించిన గత చిత్రాలు మళ్లీ ఇప్పుడు థియేటర్స్‌‌లో విడుదల చేసి ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొందరు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్‌‌లోనూ రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా రామ్ చరణ్ కెరీర్‌‌లో నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘మగధీర’ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు.

చరణ్ బర్త్‌‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల 26న నిర్మాతలు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో  ఈ చిత్రాన్ని  రీ రిలీజ్ చేస్తున్నాం.  మమ్మల్ని సపోర్ట్ చేసి మళ్లీ  విడుదలకు అవకాశం ఇచ్చిన  ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు.

తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్‌‌కు బర్త్‌‌డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో పదిహేనేళ్ల  క్రితం విడుదలైన ఈ చిత్రం ఆల్‌‌ టైమ్ ఇండస్ట్రీ హిట్‌‌గా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌‌లో ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు.