ఈక్వెడార్ లో భూకంపం..14 మంది మృతి

 ఈక్వెడార్ లో భూకంపం..14 మంది మృతి

అమెరికాలోని  ఈక్వెడార్,  ఉత్తర పెరూలో  భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదయ్యింది.  భూకంప తీవ్రతకు  14 మంది చనిపోయారు.  కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు.  చాలా భవనాలు, స్కూళ్లు,  వైద్య కేంద్రాలు నేలమట్టం అయ్యాయి. రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గుయాస్ ప్రావిన్స్ లోని బాలావో నగరానికి 10కిలోమీటర్ల దూరంలో 66.4 కిమీ లోతులో భూకంపం సంభవించినట్లు చెప్పారు.