రైల్వే రెస్ట్ కోచ్ లో చెలరేగిన మంటలు .. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన

రైల్వే రెస్ట్ కోచ్ లో  చెలరేగిన మంటలు .. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన
  • నలుగురికి తప్పిన ప్రమాదం    

నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్​ ఆవరణలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్​లో నిలిపి ఉన్న రెస్ట్  కోచ్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్  సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కోచ్​లో నలుగురు ఉద్యోగులు ఉండగా, మంటలను గుర్తించి కంపార్ట్​మెంట్  తలుపులు తెరిచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకొని రెస్ట్  కోచ్ లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. స్టేషన్​ ఆవరణలో దట్టమైన పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.