రూ.5 వేల ఉంగరం పోయిందని.. స్టూడెంట్ ఆత్మహత్య

రూ.5 వేల ఉంగరం పోయిందని.. స్టూడెంట్ ఆత్మహత్య

నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో గోల్డ్​ రింగ్ ​కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తిడతారని భయపడిన ఓ యువతి ఉరేసుకుంది. ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలం గున్నెపల్లికి చెందిన మద్దుల హేమలతారెడ్డి (19) హనుమకొండలోని సిటీ డిగ్రీ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది. ఉగాది పండుగకు ఇంటికి వచ్చిన యువతి తన చేతికి ఉన్న గోల్డ్ రింగ్​ను ఎక్కడో పోగొట్టుకుంది.

 ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారనే భయంతో మంగళవారం సూసైడ్​ లెటర్​ రాసి ఇంట్లో ఉరేసుకుంది. యువతి తల్లిదండ్రులు సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి డోర్​ కొట్టారు. ఎంతకీ తీయపోవడంతో కిటికీలో నుంచి చూడగా అప్పటికే హేమలత చనిపోయి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తండ్రి జానకిరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.