
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో రివ్యూ చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టులకు భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్ పెట్టాలి
ఇందిరమ్మ ఇండ్లపై ఫోకస్ పెట్టి, నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీపీఎం, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. ఇండ్లు మంజూరైన వారు నిర్మించుకోకపోతే వేరేవాళ్లకు కేటాయిస్తామని చెప్పాలన్నారు. వన మహోత్సవంలో వారంలోగా మొక్కలు నాటాలని సూచించారు. ఏదో ఒక పాఠశాలను ఎంపీడీవోలు ఎంపిక చేసుకొని, న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసుకోండి
చిన్నచింతకుంట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. తిరుమలాపూర్ లో నిర్మాణంలో ఉన్న ఇండ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ.. డబ్బులు విషయంలో ఆందోళన చెందవద్దని, వివిధ దశల్లో పనులు పూర్తి చేసిన వెంటనే బ్యాంక్అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు.