చిన్నారి లంగ్స్​ నుంచి ఇనుప మేకు తొలగింపు

చిన్నారి లంగ్స్​ నుంచి ఇనుప మేకు తొలగింపు

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు:  చిన్నారి లంగ్స్​ నుంచి ఇనుప మేకును శుక్రవారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్​ డాక్టర్లు  తొలగించారు.  వికారాబాద్ జిల్లా కొడంగల్ కు చెందిన  చిన్నారి(4)  రెండు వారాల నుంచి తీవ్రమైన దగ్గు, పిల్లి కూతలతో బాధపడ్తూ పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఎస్వీఎస్ హాస్పిటల్​లో చికిత్స కోసం వచ్చింది. చిన్నారికి  ఛాతిలో ఎక్స్​రే తీయగా అందులో ఎడమ వైపు ఊపిరితిత్తి గాలి గొట్టంలో బయట ఇనుప మేకు ఉందని గుర్తించారు.  పల్మోనాలజీ డాక్టర్​  వెంకటేశ్వర్ రెడ్డి లేటెస్ట్​ బ్రాన్ కో స్కాన్ పద్ధతి ద్వారా అనస్తీషియా డాక్టర్ అయతుల్లా సహకారంతో ఊపిరితిత్తుల నుంచి ఇనుప మేకు తొలగించారు. ఆపరేషన్​లో   హెచ్​వోడీ డాక్టర్ రెడ్డి, అనస్తీషియా   డాక్టర్లు రామకృష్ణ, పీజీ డాక్టర్లు వినయ్, లావణ్య, సిద్దిఖీ, సుమ, గ్రేస్, అనుదీప్, శ్రీవాణి, స్నగ్ధ, శరణ్య,  డాక్టర్ నసీన్ పాల్గొన్నారు.  ఆపరేషన్​ను సక్సెస్ చేసిన  వైద్య బృందాన్ని ఎండీ రాంరెడ్డి అభినందించారు.