
- ఆలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
కుంటాల, వెలుగు: ముథోల్ నియోజకవర్గ పరిధిలోని బాసర అమ్మవారి ఆలయంతో పాటు ప్రాచీన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం కుంటాలలో మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవం, బోనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహాలక్ష్మి ఆలయాన్ని తన సొంత ఖర్చులతో నిర్మించిన జనగామ ఆర్టీవో శ్రీనివాస్ గౌడ్‌ను అభినందించారు.
మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ఆప్క గజ్జరాం, జీవీ రమణా రావు, బీజేపీ అధ్యక్షుడు పసుల నవీన్, జక్కుల గజేందర్, రమేశ్ గౌడ్, పిప్పెర వెంగల్ రావు, ప్రకాశ్ గౌడ్, బోగ గోవర్ధన్ పాల్గొన్నారు.