దేశ రాజధానిలో ఘనంగా బోనాలు

దేశ రాజధానిలో ఘనంగా బోనాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని తెలంగాణ భవన్ లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకులు జరుగుతున్నాయి. నేడు, రేపు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా తెలంగాణ భవన్ పరిసరాల్లో ఘటాల ఊరేగింపు, కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, డప్పు, డోలు దరువులు, అమ్మవారి వేశధారణ, పులి వేశధారణ చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి దాదాపు 300 మంది భక్తులు, కళాకారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఏడు ఏళ్లుగా ఇక్కడ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ తెలిపింది.