
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లైఓవర్ పై నుంచి వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటన నాగపుర్- ఇంగన్‌ఘాట్ మార్గంలోని బోర్‌ఖేడి సమీపంలో 796/16 పాయింట్ వద్ద చోటుచేసుకుంది.
ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కారు హైదరాబాద్ కు చెందినది అని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ వెళ్తు్ండగా ఈ ఘటన చోటుచేసున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సంఘటన తెలుసుకున్న రైల్వే అధికారులు ఆ మార్గంలో వెళ్లే రైళ్లను ఆరగంట సేపు ఆపేశారు. కారును పక్కకు తొలగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.