గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ అనుచరుడు.. 25 ఏళ్ల తర్వాత షూటర్ అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ అనుచరుడు.. 25 ఏళ్ల తర్వాత షూటర్  అరెస్ట్

పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ అనుచరుడు, షూటర్ ను  ఓ హత్య కేసులో 25 యేళ్ల తర్వాత అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.  నిందితుడు అహ్మద్ ఫిదా హుస్సేన్ షేక్ (50)ని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.  
ఫిదా హుస్సేన్ షేక్ ఛోటా షకీల్ గ్యాంగ్ షూటర్..  జూలై 28న థానే రైల్వే స్టేషన్ సమీపంలో పైడోనీ పోలీసులు అరెస్టు చేశారు. అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ గ్యాంగ్ సభ్యుడి హత్య  కేసులో షేక్ నిందితుడు అని అధికారి తెలిపారు.
 
1997 ఏప్రిల్ 2 సాయంత్రం అరెస్టయిన అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ముఠా సభ్యుడు మున్నా ధారిని నిందితుడు అతని సహచరులతో కలిసి కాల్చి చంపారు. ఆ సమయంలో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి షేక్‌ను అరెస్టు చేశారు. IPC సెక్షన్ 302, 34, ఆయుధ చట్టంలోని సెక్షన్ 3, 25 కింద కేసు నమోదు చేశామని అధికారి తెలిపారు.

1998లో హుస్సేన్ షేక్ కోర్టు బెయిల్‌పై విడుదలయ్యాడు. 1998 నుంచి షేక్‌ అండర్‌గ్రౌండ్‌కి వెళ్లాడని, ఎలాంటి కోర్టు విచారణకు హాజరుకాలేదని, ఈ కేసులో అతడిని పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించిందని పోలీసు అధికారి తెలిపారు. షేక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ..అతని లొకేషన్‌ను ట్రేస్ చేయగా అతను థానే రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఉచ్చు బిగించి థానే రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు.