మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. థానే, మీరా భైందర్ పట్టణాల్లో ని నగరాల్లో అనుమతి లేకుండా నిర్వహించే పబ్బులు, బార్లను బుల్డోజర్లతో కూల్చివేయాలని మహారాష్ట్ర సీఎం షిండే మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్‌లను ఆదేశించారు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహారాష్ట్రలో ప్రతి నగరం, పట్టణం డ్రగ్స్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పూణే ఫెర్గూసన్ కాలేజ్ రోడ్‌లోని లిక్విడ్ లీజర్ లాంజ్ (L3) నుండి వైరల్ అయిన వీడియోలో... కొంతమంది యువకులు డ్రగ్స్తీసుకున్నట్లుగా గుర్తించారు. ఆ యువకులు మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన 48 గంటలు తరువాత పూణెలో అక్రమంగా నిర్వహించే పబ్లు,బార్లను ధ్వంసం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణం తీసుకుంది. దీంతో నియమాలకు విరుద్దంగా నిర్మించిన భవనాలను కూల్చివేత కార్యక్రమం చేపట్టారు.
పుణేలోని అక్రమ పబ్బులు, బార్స్, రెస్టారెంట్లపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) కొరడా ఝులిపించింది. ఇప్పటివరకు 33 అక్రమ పబ్బులను బుల్డోజర్లతో కూల్చివేసింది. వీటిలో పేరున్న పబ్బులు కూడా ఉన్నాయి. ముంబయిలోని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పూణేను డ్రగ్స్ రహిత నగరంగా మార్చడానికి డ్రగ్స్ పెడ్లర్లపై నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని పోలీసులకు సీఎం షిండే ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో అతిపెద్ద నగరంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టే దిశగా ఓ వీడియో వైరల్ వీడియోపై పోలీసుల దర్యాప్తు ఈవెంట్ ఆర్గనైజర్‌తో సహా ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. నిబంధలను విరుద్దంగా .. అక్రమంగా నిల్వ చేసిన డ్రగ్స్, మద్యం స్టాక్ ను స్వాధీనం చేసుకుని .. ఎల్ 3 నుండి ఆరుగురు వెయిటర్లను ఎక్సైజ్ శాఖ అదుపులోకి తీసుకుంది.
మహారాష్ట్ర ముంబైలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెంట్రల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది . ఇదిలా ఉండగా, విద్యా, ఐటీ హబ్‌లకు పేరుగాంచిన పూణేలో తమ పార్టీ పబ్ కల్చర్‌ను అనుమతించబోదని బీజేపీ పూణే యూనిట్ అధ్యక్షుడు ధీరజ్ ఘాటే ప్రకటించారు. పబ్ కల్చర్‌కు వ్యతిరేకంగా పోలీసులు, పూణే మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని ఘాట్ పిలుపునిచ్చారు. రాజకీయ ప్రతిచర్యలు పూణేలోని కస్బా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ నగరంలో గణనీయమైన స్థాయిలో డ్రగ్స్ లభ్యమయ్యాయని ఆరోపించారు. పోలీసుల సహకారంతో ఈ వ్యాపారం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పూణేలో మాదకద్రవ్యాల సంబంధిత సమస్యలపై పోరాడతామనన్నారు. పూణేలోని నైట్ లైఫ్ సీన్‌లో డ్రగ్స్ వినియోగం పెరుగుతుంది. ఈ క్రమంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించే సంస్థలపై .. ఆ సంస్థల నిర్వాహకులను కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.చట్టవ్యతిరేక కార్యకలాపాల నీడన పడకుండా విద్య, ఐటీ పరిశ్రమలకు పుణె కేంద్రంగా ఉండేలా కృషి చేస్తామని సీఎం షిండే అన్నారు.
