కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ థాక్రే కేంద్రానికి లేఖ రాసినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. సీఎంలతో మోడీ సమావేశం సందర్బంగా థాక్రే కేంద్రానికి రాసిన లేఖలో కోవిడ్ మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరినట్లు చెప్పారు.   ఈ విషయంపై సుప్రీం కోర్టు కూడా దృష్టి పెట్టాలన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల దేశానికి ప్రయోజనమన్నారు.