ఇంజినీర్‌పై బురద పోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇంజినీర్‌పై బురద పోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ముంబై : ఎమ్మెల్యే అయి ఉండి దిగజారుడు పని చేశారు. తన అనుచరులతో కలిసి ఓ ప్రభుత్వ ఇంజనీర్‌పై దాడి చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నితేశ్‌ రాణా. కంకావలి దగ్గర ముంబై-గోవా హైవేపై ఏర్పడిన గుంతలను పరిశీలిస్తున్న క్రమంలో.. ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని అతడిపై బురద పోసి అవమానించారు.

బాధితుడిని బ్రిడ్జికి కట్టేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారడంతో నితీశ్‌ రాణా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నితీశ్‌ రాణా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నారాయణ్‌ రాణా కుమారుడు.