27కు చేరిన మహారాష్ట్ర ఎన్‍కౌంటర్​ మృతుల సంఖ్య

V6 Velugu Posted on Nov 18, 2021

భద్రాచలం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారాపట్టి అటవీ ప్రాంతంలో గత శనివారం జరిగిన ఎన్‍కౌంటర్​లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 27కు చేరుకుంది. ఘటనా స్థలంలో ఆ రోజు 26 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సీ-60 బలగాలు తాజాగా కూంబింగ్‍ నిర్వహిస్తుండగా మరో మావోయిస్టు శవం దొరికింది. అతని శవాన్ని బుధవారం ఐడెంటిఫికేషన్‍ కార్యక్రమంలో దండకారణ్యం స్పెషల్‍ జోనల్‍ సమితి సభ్యుడు సుఖ్‍లాల్‍గా గుర్తించారు.

మహారాష్ట్ర-– చత్తీస్‍గఢ్‍ సరిహద్దుల్లో కీలకమైన మావోయిస్టు లీడర్‍ సుఖ్‍లాల్‍. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. 51 కేసుల్లో ప్రధాన నిందితుడు. 20 హత్యలు చేశాడు. 16 విధ్వంసాల్లో కీలక సూత్రధారి.

Tagged Maharashtra, Death Toll, encounter, Maoists, Naxals, Naxalites, Gadchiroli district, Garapatti, forest area, ​​Dhanira taluk

Latest Videos

Subscribe Now

More News