50 వేల ఏండ్ల కిందటి లూనార్ లేక్.. తెల్లారేలోగా రంగు మారింది

50 వేల ఏండ్ల కిందటి లూనార్ లేక్.. తెల్లారేలోగా రంగు మారింది

ఔరంగబాద్: దాదాపు 50 వేల ఏండ్ల కిందట ఏర్పడిన మహారాష్ట్రలోని లూనార్ లేక్ ఉన్నట్టుండి పింక్ కలర్ లోకి మారిపోయింది. అప్పటివరకు సాధారణంగా ఉన్న ఆ లేక్ తెల్లారేలోగా గులాబీ కలర్ లోకి మారిపోవడంతో స్థానికులు పరేషాన్ అవుతున్నరు. అయితే, నీటిలో ఉప్పు శాతం, ఆల్గే ఎక్కువగా ఉండటం వల్లే ఇలా రంగు మారిందని సైంటిస్టులు చెబుతున్నారు. లేక్ కలర్ మారడం ఇది ఫస్ట్ టైం ఏం కాదని, ఇలా కలర్ మారడం ఇప్పటికే చాలాసార్లు జరిగిందని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు మారింనంత కలర్ ఫుల్ గా ఇదివరకెప్పుడూ జరగలేదని చెప్తున్నారు. నేషనల్ హెరిటేజ్ స్పాట్ అయిన ఈ లూనార్ లేక్ ముంబై నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని బుల్ధానా జిల్లాలో ఉంది.

‘‘ఈ సరస్సులో ఆల్గే, ఉప్పుశాతం ఎక్కువగా ఉండటం వల్ల అందులోని నీళ్లు ఎర్రగా మారుతాయి. గత కొన్నేళ్లతో పోలిస్తే వర్షాభావం వల్ల లూనార్ లో నీటి మట్టం తగ్గింది. తక్కువ స్థాయి నీళ్లుండటంతో లవణీయత, ఆల్గే ప్రభావంతో నీళ్ల రంగు మరింత ఎక్కువగా మారి ఉండవచ్చు”అని లూనార్ లేక్ పరిరక్షణ, అభివృద్ధి కమిటీ సభ్యుడు గజానన్ ఖారత్ అంటున్నారు.