కాదులూర్​లో కుస్తీ పోటీలు విజేతగా మహారాష్ట్ర వాసి

కాదులూర్​లో కుస్తీ పోటీలు విజేతగా మహారాష్ట్ర వాసి

టేక్మాల్,వెలుగు : మెదక్ ​జిల్లా టేక్మాల్​మండల పరిధిలోని కాదులూర్ మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమ వారం  కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలకు మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తరలివచ్చిన మల్లయోధులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కుస్తీ మొదలుకొని వెండి కడియం కుస్తీ వరకు హోరాహోరీగా సాగిన పోటీల్లో మహారాష్ట్రలోని లాతూర్​ జిల్లా ఉద్గిర్​కు చెందిన అభిజిత్ విజేతగా నిలిచాడు.

 ఇతడికి సర్పంచ్ యాదయ్య 5 తులాల వెండి కడియాన్ని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో గంగి మంజుల, రాజేందర్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపసర్పంచ్ జ్యోతి, లక్ష్మీనారాయణ, దుర్గగౌడ్, మల్లేశం పాల్గొన్నారు. ఎస్సై రమేశ్​బందోబస్తు నిర్వహించారు.