మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక ఫలితాలు వాయిదా

మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక ఫలితాలు వాయిదా

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మార్చి 28న మహబూబ్ నగర్ లోని MLC పదవికి ఎన్నికలు నిర్వహించారు. అయితే  ఏప్రిల్ 2న జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్ ను ఎన్నికల కమిషనర్ ఆదేశింది.  ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందని ఎన్నికల కమిషన్ ఈనిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలు తెలపాలని ఈసీ ఆదేశించింది. తిరిగి జూన్ 2న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని ఈసీ సూచిందింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు.

ALSO READ :- ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు