మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర కేసులో ట్విస్ట్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర కేసులో ట్విస్ట్

మహబూబ్ నగర్:  మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీతో పాటు 18 మందికి మహబూబ్‌ నగర్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాఘవేంద్ర రాజు, పుష్పలత పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో రెండు వేర్వేరు పిటిషన్లు  రాజు, పుష్పలత దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ పై ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారంటూ పిటిషన్ లో రాజు తెలిపారు. తన ఇంట్లోకి చొరబడి సీసీటీవీ పెన్ డ్రైవ్ హార్డ్ డిస్కులను దొంగలించారని పిటిషన్ లో చెప్పారు. విశ్వనాథ్ సతీమణి పుష్పలత మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో తన భర్త ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పుష్పలత తెలిపారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని ఫిబ్రవరిలో రాజు, విశ్వనాథ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటికి వచ్చాక.. మహబూబ్ నగర్ కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే  శ్రీనివాస్ గౌడ్ , సైబరాబాద్ సీపీ, డీసీపీ బాలానగర్ తో పాటు మొత్తం 18 మందికి నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఆగస్టు 10న హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.