మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మెడికల్ కాలేజీ పర్మిషన్ ​రద్దు

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మెడికల్ కాలేజీ పర్మిషన్ ​రద్దు
  • ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ లేఖ

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్​కు రద్దు చేస్తున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంభు శరణ్​కుమార్ 16న డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్రువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెటర్ పంపించారు. ఫ్యాకల్టీ కొరత, బయోమెట్రిక్ అటెండెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేక పోవడం, సీసీ కెమెరాలు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయకపోవడంతో అనుమతి రద్దు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తనిఖీలు నిర్వహించామని, ఈనెల 13న మళ్లీ వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  కాలేజీ అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. లోపాలను సవరించుకుని కమి షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నామని లేఖలో స్పష్టం చేశారు.

కాగా, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మెడికల్ కాలేజీ 2016లో ప్రారంభమైంది.  ప్రస్తుతం ఈ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ లేఖపై డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని వివరణ కోరగా సీసీ టీవీ కెమెరాల పనితీరులో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ చర్యలు తీసుకున్నదన్నారు. ఈ సమస్యను సవరించి, కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పీల్ చేశామని చెప్పారు.