
అక్కినేని సుమంత్(Sumanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మహేంద్రగిరి వారాహి(Mahendragiri Varahi). డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి(Santhossh Jagarlapudi) తెరకెక్కిస్తుండగా.. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. మీనాక్షి గోసామి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
చిమ్మచీకటిలో సుమంత్ కాగడ విలిగించడంతో మొదలైన ఈ టీజర్.. వరాహం అరుపులతో ఆసక్తినిరేపుతూ ముందుకు సాగింది. ఆ కాగడా వెలుగులో వారాహి విశ్వరూపం కనిపించడం అద్భుతంగా ఉంది. కొన్ని 1:29 సెకన్ల పాటు ఉత్కంఠగా సాగిన ఈ టీజర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం, ఆ ఆలయంలో రహస్యాల, వాటిని ఛేదించడం కోసం హీరో చేసిన ప్రయత్నాలు వంటి అంశాల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రానుందని మేకర్స్ తెలిపారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో రానున్న మహేంద్రగిరి వారాహి మూవీ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.