
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు ఘట్టమనేని సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబందించిన అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అందంగా రీల్స్ చేస్తూ వాటిని అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా.. మహేశ్ బాబు నటించిన అతడు సినిమాలోని సాంగ్కు సితార డ్యాన్స్ చేసింది. పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి పాటకు ఆమె స్టెప్పులేసింది. అయితే ఈసారి సితార డ్యాన్స్ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టుకు డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ స్పందిస్తూ నెమలిలా నాట్యం చేస్తుందని కామెంట్ చేశాడు.