నేనలా అన్లేదు.. ‘బాలీవుడ్‘ కామెంట్స్ పై ప్రిన్స్ వివరణ

నేనలా అన్లేదు.. ‘బాలీవుడ్‘ కామెంట్స్ పై ప్రిన్స్ వివరణ

హైదరాబాద్ : బాలీవుడ్ తనను భరించలేదన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సూపర్ స్టార్ మహేశ్‌బాబు వివరణ ఇచ్చారు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ ​కు రీచ్​ అవ్వాలనేదే తన కోరిక అని చెప్పారు.

బాలీవుడ్‌పై తాను ఎప్పుడు నెగెటివ్‌ కామెంట్స్‌ చేయలేదని, అన్ని భాషలను గౌరవిస్తానని చెప్పారు. బాలీవుడ్‌ సినిమాలు చేయనని చెప్పలేదని, తెలుగు సినిమాలు సౌకర్యంగా ఉంటాయని మాత్రమే చెప్పానని అన్నారు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్‌ అవ్వాలనేదే తన కోరిక అన్నారు. తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా విజయవంతం కావడం సంతోషకరమని, ఈ విషయంలో తనకు చాలా హ్యాపీగా ఉందన్నారు. తెలుగు ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ కి ఎందుకు వెళ్లాలనేదే తన ఫీలింగ్ అని, తాను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను అంటూ వివరణ ఇచ్చారు. డైరెక్టర్ రాజమౌళితో చేయబోయే మూవీ కూడా పాన్ ఇండియా సినిమానే అని మహేశ్​ చెప్పారు. 

అంతకుముందు ఇంటర్వ్యూలో మహేశ్ ఏం మాట్లాడరంటే..
తనకు హిందీ నుంచి చాలా ఆఫర్స్​ వచ్చాయని, అయితే బాలీవుడ్​ తనను భరించలేదని భావిస్తున్నానని మహేష్ బాబు చెప్పారు. తనకు వచ్చిన హిందీ సినిమా అవకాశాలను వినియోగించుకుంటూ సమయాన్ని వృథా చేయాలనుకోవట్లేదని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకున్న స్టార్ డమ్ ఇక్కడి వారు చూపించే ప్రేమ వల్ల ఇతర ఇండస్ట్రీలకు వెళ్లాలన్న ఆలోచన కూడా లేదని చెప్పారు. భారతదేశంలోని ప్రజలందరూ తెలుగు సినిమాలను కూడా చూడాలని తానెప్పుడు కోరుకుంటానని, ప్రస్తుతం అది జరుగుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. 

మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్’ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదల అనంతరం ఓ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి మహేష్ బాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ను బీటౌన్ ఫ్యాన్స్ తప్పుపట్టడంతో మహేష్ బాబు స్పందించి.. వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

నేపాల్ బౌలర్ ‘పుష్ప’ సెలబ్రేషన్స్.. ఐసీసీ రియాక్షన్

డబ్ల్యూఆర్ఆర్ పేరుతో లూటీకి టీఆర్ఎస్ స్కెచ్