చంద్రబాబు, పవన్ గెలుపుపై మహేశ్ బాబు ట్వీట్

చంద్రబాబు, పవన్ గెలుపుపై మహేశ్ బాబు ట్వీట్

ఏపీలో కూటమి భారీ విజయం సాధించడంతో  సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే  చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, హీరో నాని,మోహన్ బాబు, అనిల్ రావిపూడి, రవితేజ, నితిన్, డైరెక్టర్ క్రిష్, కాజల్ అగర్వాల్ కూటమికి విషెస్ చెప్పారు. ఈ లిస్టులో ఇపుడు మహేశ్ బాబు చేరారు. 

ఏపీ సీఎంగా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు, మీ టర్మ్ విజయవంతంగా సాగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
 
పవన్ కళ్యాణ్ కు విషెష్ చెప్పిన మహేశ్..  ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి మీ విజయం ప్రతిబింబం.   ప్రజలకు మంచి చేయాలన్న మీ  కలను సాకారం చేయడంలో విజయం సాధించాలని కోరారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135,జనసేన21,బీజేపీ 8, వైఎస్సార్ సీపీ 11 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. చంద్రబాబు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.