
మోకాలి సర్జరీతో పాటు కొవిడ్ బారిన కూడా పడటంతో వర్క్‌కి దూరంగా ఉన్న మహేష్ బాబు.. ఈ నెల సెకెండ్ వీక్ నుంచి మళ్లీ షూట్‌లో పాల్గొనబోతున్నాడు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ కొత్త షెడ్యూల్ నిన్న హైదరాబాద్‌లో మొదలైంది. ఏప్రిల్ 1న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడా ప్లాన్‌లో మార్పు వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని మార్చ్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటన రావడంతో మిగతా సినిమాలతో పాటు మహేష్ సినిమా కూడా వాయిదా పడింది. వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు త్రివిక్రమ్‌తో మూడోసారి వర్క్ చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీని ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టనున్నారట. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిసింది. పూజా హెగ్డే హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో నటించనున్నాడు మహేష్.