ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోంది

ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోంది

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోందని ఆల్ ఇండియా కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ రాజ్ ఆరోపించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో  ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్షతపై సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కులం పేరుతో ఉద్యోగ సంఘాల నాయకులను సింగరేణి యాజమాన్యం వేధిస్తోందని ఆరోపించారు. గిరిజన సంక్షేమం కోసం ఖర్చు చేయవలసిన 20 శాతం లాభాలను పక్క దారి పట్టించిన సింగరేణి యాజమాన్యం పైచర్యలు తీసుకోవాలని, బొల్లా రమేశ్ పై వేసిన చార్జ్ షీట్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని, ఖాళీగా ఉన్న 665 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.  సింగరేణి కాంట్రాక్ట్ బొగ్గు లారీ ప్రమాదంలో చనిపోయిన నలుగురు మహిళలకు సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలని, సింగరేణిలో ఇంత జరుగుతున్న ఏమాత్రం పట్టించుకోని సంస్థ సీఎండీ శ్రీధర్ ను పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ  సమావేశంలో గిరిజన, లంబాడీల ఐక్య వేదిక చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్, జేబీ రాజు, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.