
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కష్టపడిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన న్యాయం చేస్తామని పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. సోమవారం గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహేశ్ గౌడ్ హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే మహిళా కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, పదవులు రాలేదని నిరాశ చెందొద్దని, పనిచేసుకుంటూ పోతే పదవులు అవే వస్తాయన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో మహిళా కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. మహిళ సంక్షేమానికి, వారి రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని వివరించారు.