'ఎమర్జెన్సీ' నుంచి లేటెస్ట్ అప్ డేట్

'ఎమర్జెన్సీ' నుంచి లేటెస్ట్ అప్ డేట్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి పాత్రలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంది చిత్రం బృందం. తాజాగా ఈ మూవీ నుండి నటి మహిమా చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఇందిరా గాంధి సన్నిహితురాలు పుపుల్ జయంకర్ గా ఆమె నటిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడులైన కంగనా ఫస్ట్ లుక్, మూవీ టీజర్ అందర్నీ ఆకట్టుకున్నాయి. 1977లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 

ఈ సినిమాను కంగనా తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మిస్తుంది. పొలిటికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు, రాజకీయ కుట్రలు, దేశం ఎదుర్కొన్న సంక్షోభం వంటివి చూపించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రితేష్ షా ఈ ఎమర్జెన్సీ చిత్రానికి రచయిత కాగా కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.