ఆర్మీ కోసం మహీంద్రా ఆర్మడో వాహనం.. ఇది మామూలుగా లేదుగా...

 ఆర్మీ కోసం మహీంద్రా ఆర్మడో  వాహనం.. ఇది మామూలుగా లేదుగా...

భారత ఆర్మీ కోసం తయారు చేసిన ఆర్మర్డ్  లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ALSV)ను తొలి డెలివరీ ఇవాళ ( జూన్ 18) చేశామని మహేంద్ర గ్రూప్ (Mahindra Group) ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఇవి భారత మొట్టమొదటి ఏఎల్ఎస్ వాహనాలని వివరించారు.

దేశీయ దిగ్గజ కార్ మేకర్ మహీంద్ర ఇండియా సాయుధ దళాల కోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని రూపొందించింది. ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ALSV) ‘ఆర్మడో’ డెలివరీని ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(MDS) పేరుతో పూర్తి దేశీయ టెక్నాలజీతో మహీంద్రా గ్రూప్ ఈ వాహనాలను తయారు చేస్తోంది. డెలివరీకి సంబంధించిన వీడియో, ఫొటోలను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

భారత సాయుధ దళాల కోసం...

‘‘మహీంద్రా డిఫెన్స్, మేము ఇప్పుడే ఆర్మడో- భారతదేశపు మొదటి ఆర్మడర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికిల్ డెలివరీని ప్రారంభించాము. మన సాయుధ దళాల కోసం భారతదేశంలో గర్వంగా అభివృద్ధి చేసి రూపొందించబడింది. జైహింద్’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న వారికి ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు. సహనం, పట్టుదల, అభిరుచితో ఈ ప్రాజెక్టును నిజం చేసిన సుఖ్‌విందర్ హేయర్ అతని టీంకి నా కృతజ్ఞతలు అంటూ మహీంద్రా మరో ట్వీట్ లో పేర్కొన్నారు. భారత సాయుధ దళాల కోసం ఈ వాహనాలను సగర్వంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేశామని తెలిపారు. 

ఇండియన్ టెక్నాలజీతో...

 ఈ Armado వాహనాలను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇందులో  ఐదుగురు ప్రయాణించవచ్చు. ఆర్మడో అనేది భారత రక్షణ దళాల ఉపయోగం కోసం నిర్మించిన తేలికపాటి సాయుధ వాహనం. ఇందులో  అదనపు లోడ్ బేరింగ్ కెపాసిటీని అమర్చారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు, ఉద్రిక్త ప్రాంతాలలో పెట్రోలింగ్ లలో ఉపయోగపడనుంది. ఎడారి భూభాగాల్లోనూ దూసుకుపోతాయి.ప్రత్యేకదళాలు,క్విక్ యాక్షన్ టీమ్స్ కి ఈ వాహనం చాలా అనుకూలంగా ఉండనుంది. దీన్ని సరిహద్దుల వెంబడి ఎడారి ప్రాంతాల్లో, సరిహద్దు భద్రత కోసం ఉపయోగించవచ్చు.

ఢిపెన్స్ రంగంలో భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో సొంతగా ఆర్మీకి, ఇతర సాయుధ దళాలకు అవసరమయ్యే పరికరాలను, ఆయుధాలను ఇండియాలోనే తయారు చేసేలా ప్రోత్సహిస్తోంది. దీంట్లో భాగంగానే మహీంద్రా తన ఆర్మడోను తీసుకువచ్చింది.

https://twitter.com/anandmahindra/status/1669955613407969280