రైతుల కోసం కొత్త రకం నాటు యంత్రాలు

రైతుల కోసం కొత్త రకం నాటు యంత్రాలు
  • మహీంద్రా ట్రాన్స్​ ప్లాంటర్లు

హైదరాబాద్, వెలుగు:  వరి రైతులకు దిగుబడులను, ఆదాయాలనూ పెంచగల కొత్త రకం  ట్రాన్స్‌‌‌‌ప్లాంటర్స్‌‌‌‌ను (నాటు వేసే యంత్రాలు) తెలంగాణ మార్కెట్లలో లాంచ్ చేశామని మహీంద్రా ఫార్మ్ ఎక్విప్​ మెంట్​ డివిజన్ ప్రకటించింది. మనదేశంలోనే మొట్టమొదటి నాలుగు వరుసల ట్రాన్స్‌‌‌‌ప్లాంటర్‌‌‌‌ ‘మాస్టర్‌‌‌‌ ప్యాడీ 4ఆర్‌‌‌‌ఓ’  రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలిపింది. జపాన్‌‌‌‌కు చెందిన మిత్సుబిషి సాయంతో వీటిని మహీంద్రా అగ్రికల్చరల్‌‌‌‌ మెషినరీ డిజైన్‌‌‌‌ చేసింది.  ఈ ట్రాన్స్​ ప్లాంటర్లు కూలీల అవసరం తగ్గించడంతో పాటుగా సమయాన్ని ఆదా చేస్తాయి.  మాస్టర్‌‌‌‌ ప్యాడీ 4ఆర్‌‌‌‌ఓ ధర 7.5 లక్షలు. ఈ రైస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ప్లాంటర్‌‌‌‌ ఎక్కువ వ్యవసాయ భూములు కలిగిన రైతులతో  పాటుగా అద్దెకు ఫార్మ్ ఎక్విప్​ మెంట్ ఇచ్చే వారికి చక్కగా సరిపోతుంది. ఇందులో 4 వీల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ టెక్నాలజీ, పవర్‌‌‌‌ స్టీరింగ్‌‌‌‌, స్మైల్‌‌‌‌ యు టర్న్‌‌‌‌–180 డిగ్రీ టర్నింగ్‌‌‌‌ రేడియస్‌‌‌‌ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. చిన్న రైతుల కోసం డెవెలప్ చేసిన ‘ఎంపీ 461’ రైస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ప్లాంటర్‌‌‌‌ మోడల్‌‌‌‌ ధర రూ. 2.8 లక్షలని కంపెనీ తెలిపింది.