హైదరాబాద్‌లో మహీంద్రా భారీ గోదాం 

హైదరాబాద్‌లో మహీంద్రా భారీ గోదాం 

హైదరాబాద్‌లో మహీంద్రా భారీ గోదాం 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : మహీంద్రా లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌) నెట్‌‌‌‌‌‌‌‌ జీరో వేర్​హౌస్​ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం ప్రారంభించింది. సస్టెనబుల్​ వేర్​హౌసింగ్,​ ఆర్కిటెక్చర్​, మల్టీ క్లయింగ్​ కేపబిలిటీస్​, క్లీన్​ ఎనర్జీ వాడకం, వనరుల సంరక్షణ, భారీగా పచ్చదనం దీని ప్రత్యేకతలు. దీనిని సిద్ధిపేట జిల్లా  ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రీయల్‌‌‌‌‌‌‌‌ పార్క్​లో ఏర్పాటు చేశారు.  దేశవ్యాప్తంగా ఎంఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌  మల్టీ యూజర్‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్డ్‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీలకు ఈ కేంద్రం అత్యంత ముఖ్యమైనదని కంపెనీ తెలిపింది. ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ కస్టమర్లకూ సేవలనూ అందజేస్తుంది. ఇదిపూర్తిగా  సోలార్, బ్యాటరీ స్టోర్డ్‌‌‌‌‌‌‌‌ శక్తితో  పనిచేస్తుంది. మిగులు కరెంటును గ్రిడ్‌‌‌‌‌‌‌‌కు అందజేస్తుంది.

ఈ గోదాముతో 350 మందికి పైగా ఉపాధి దొరుకుతుందని మహీంద్రా లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌ ఎండీ  రామ్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ స్వామినాథన్‌‌‌‌‌‌‌‌  అన్నారు. ‘‘దీనిని అసెట్​లైట్​ మోడల్​లో 17 ఎకరాల్లో నిర్మించాం. దాదాపు రూ.40 కోట్ల వరకు ఖర్చయింది. మాకు దేశంలో 250 వేర్​హౌస్​లు ఉన్నాయి. ఏటా ఏడు కోట్ల డెలివరీలు ఇస్తున్నాం. ప్రస్తుతం 12,500 మంది ఉద్యోగులు ఉన్నారు. చాలా వేర్​హౌస్​లను క్లీన్​ఎనర్జీతోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణవ్యాప్తంగా మాకు 14 వేర్​హౌస్​లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న నగరాల్లో విస్తరణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం”అని ఆయన వివరించారు.