శానిటైజర్స్ ను తయారు చేస్తున్న మహీంద్రా సంస్థ

శానిటైజర్స్ ను తయారు చేస్తున్న మహీంద్రా సంస్థ

ముంబై : దేశంలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు మహీంద్రా సంస్థ తమ వంతు సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే వెంటిలేటర్లు, మాస్క్ లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) తయారు చేస్తోన్న సంస్థ తాజాగా ముంబైలోని ఆటో ఫ్లాంట్ లో శానిటైజర్స్ తయారు చేస్తోంది. దాదాపు 500 మంది ఉద్యోగులు ఇందుకోసం శ్రమిస్తున్నారు. శానిటైజర్స్ అనుమతించేందుకు ప్రభుత్వం నుంచి మహీంద్రా సంస్థ అనుమతి కోరింది. మహీంద్రా ఆటో, ట్రాక్టర్స్ ప్లాంట్లను వెంటిలేటర్లు, గ్లౌవ్స్ , శానిటైజర్స్ ను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక్కో వెంటిలేటర్ ను రూ. 7500 రూపాయలకే అందించేలా వాటిని సంస్థ తయారు చేస్తోంది. కరోనా కేసులు పెరిగినా వెంటిలేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ కు కొరత లేకుండా ఉండేందుకు కేంద్రం పలు ప్రైవేట్ సంస్థలను వీటిని తయారు చేయాలని కోరింది. దీంతో మహీంద్రా సంస్థ ముందుకు వచ్చి కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తోంది.